బంగారం అమ్మే ఏటీఎం ఇది..

బంగారం అమ్మే ఏటీఎం ఇది..

హైదరాబాద్, వెలుగు: గోల్డ్‌ సిక్కా  శనివారం హైదరాబాద్​లో ఏఐ ఆధారిత గోల్డ్ మెల్టింగ్ ఏటీఎంను ప్రారంభించింది. దీంతో బంగారాన్ని కొనడం, అమ్మడం, మార్చడం, లీజుకు ఇవ్వడం వంటివి చేయవచ్చని హైదరాబాద్​కు చెందిన ఈ సంస్థ ప్రకటించింది. బంగారు రుణాలు మినహా అన్ని సేవలు ఇది అందిస్తుంది. దీని నుంచి నగలనూ కొనుక్కోవచ్చు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ టెలర్ మెషిన్.

ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం ఇదేనని గోల్డ్‌ సిక్కా లిమిటెడ్ ఎండీ, సీఈఓ తరుజ్ అన్నారు. ‘‘భారతదేశంలో మొట్టమొదటి రియల్ టైమ్ గోల్డ్ ఏటీఎం 2022లో ప్రవేశపెట్టాం. ఈ ఏటీఎంలో  ఏఆర్ టెక్నాలజీ ఉంటుంది. దీంతో వినియోగదారులు ఆభరణాలను వర్చువల్‌గా ధరించవచ్చు.  నచ్చితే అక్కడే కొనుక్కోవచ్చు.   ఏడాదిలోపు దేశవ్యాప్తంగా 100 ఏటీఎంలను,  ఇతర దేశాలలో 100 ఏటీఎంలను ఏర్పాటు చేస్తాం" అని ఆయన వివరించారు.