త్వరలోనే వసంతం వస్తది.. తిరిగి వస్తాం: అమృతా ఫడ్నవీస్

త్వరలోనే వసంతం వస్తది.. తిరిగి వస్తాం: అమృతా ఫడ్నవీస్

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంధ్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన తర్వాత ఆయన భార్య అమృతా ఫడ్నవీస్ కవితాత్మకమైన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్త పరిచారు.

पलट के आऊंगी शाखों पे खुशबुएँ लेकर,
खिज़ां की ज़द में हूँ मौसम ज़रा बदलने दे!

తిరిగి వస్తాం మరిన్ని సువాసనలను వెదజల్లడానికి.. ఇది శరధ్రుతువని వాతావరణం మారేవరకు వేచిచూస్తామని అన్నారుఅమృతా ఫడ్నవీస్. మహారాష్ట్ర ప్రజలు ఐదేళ్లుగా తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. మీ వదిన (అమృతా ఫడ్నవీస్) ఎప్పటికీ మహారాష్ట్ర ప్రజల ప్రేమను గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంతవరకు సమర్ధవంతంగా పనిచేయడానికి ప్రయత్నించానని తెలిపారు.

బుధవారం సాయంత్రంలోగా బలపరీక్ష నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపుతిరిగాయి. దీంతో దేవేంధ్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు.అయితే..  మరికొద్ది సేపట్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నుంచి సీఎం అభ్యర్తిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ను ఎన్నుకోనున్నారు. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.