కూకట్​ పల్లి పీఎస్​ ఎదుట విద్యార్థుల ఆందోళన

కూకట్​ పల్లి పీఎస్​ ఎదుట విద్యార్థుల ఆందోళన
  • అమృత ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ మేనేజ్​మెంట్​అండ్​ మెడికల్ ​సైన్స్​ విద్యార్థులు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్ పల్లి పోలీసుస్టేషన్​ఎదుట అమృత ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ మేనేజ్​మెంట్​అండ్​ మెడికల్ ​సైన్స్​ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేశారు. సైన్స్ ఒకేషనల్, పారా మెడికల్​కోర్సుల పేరుతో తమ వద్ద రూ. లక్షలు వసూలు చేసి, మోసం చేసిన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాము పూర్తి చేసిన కోర్సుల సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్​ చేశారు. ఈ నెల 21న కూడా విద్యార్థులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అయితే తాము కాలేజీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, ప్రస్తుతం కాలేజీని నిర్వాహకులు పూర్తిగా మూసేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.