కాణిపాకం టెంపుల్‌కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు

కాణిపాకం టెంపుల్‌కు 7కోట్లు విరాళమిచ్చిన అజ్ఞాత భక్తుడు

చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఓ ప్రవాస భారతీయుడు (ఎన్.ఆర్.ఐ అజ్ఞాత భక్తుడు) 7 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.  చెక్కుని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎ.వెంకటేశుకు అందజేశారు. తన వివరాలు బయటపెట్టేందుకు ఆ అజ్ఞాత భక్తుడు ఒప్పుకోలేదు. కనీసం ఫోటో కూడా తీయించుకునేందుకు నిరాకరించాడు. తన దృష్టిలో ఇది సాధారణమని.. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వొద్దని కోరారు. కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి ఇంత భారీ మొత్తంలో.. ఇలాంటి విరాళం అందునా అతిపెద్ద విరాళం ఇదే మొదటిసారి అని ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. ఈ సందర్భంగా అజ్ఞాత ప్రవాస భారతీయ భక్తుడికి ఆలయ ఈవో  కృతజ్ఞతలు తెలిపారు.

For More News..

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం

క్లాస్ రూమ్‌లో లేడీ టీచర్ పై కత్తితో దాడి

గుర్తుంచుకోండి.. బెంగాల్‌లో గెలిచేది దీదీనే

ఎంఈఓ సహా ఆరుగురు టీచర్లు సస్పెన్షన్