
దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ డిమాండ్
నరసింహులుది ప్రభుత్వ హత్యేనని విచారణలో తేల్చిన కమిటీ
గజ్వేల్, వెలుగు: దళిత రైతు బ్యాగరి నర్సింహులుది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రేరేపిత హత్యే అని దళిత సంఘాల నిజనిర్ధారణ కమిటీ బృందం ప్రతినిధులు స్పష్టం చేశారు. శనివారం దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్ , రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, దళిత బహుజన మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు పులి కల్పన, మాల జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిజనిర్ధారణ కమిటీ బృందం వేలూర్‌లోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ.. కరోనా ఉందని నర్సింహులు మృతదేహానికి రాత్రికి రాత్రి అంతక్రియలు బలవంతంగా చేయడం తగదన్నారు. నిందితులైన సర్పంచ్ , వీఆర్వో, తహసీల్దార్‌లను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి, కలెక్టర్, సీపీ వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట దలిత సంఘాల నాయకులు కరికె శ్రీనివాస్, దేవయ్య, తుమ్మ శ్రీ నివాస్, దాసరి ఎగొండ స్వామి, ర్యాకం శ్రీ రాములు, బుట్టి సత్యనారాయణ, బయ్యారం యాదగిరి, అల్లిబెల్లి నర్సిం గరావు, నీరుడు స్వామి ప్రవీణ్, బెజుగామ వేణు ఉన్నారు.