రికార్డు: ఎర్రగడ్డ గణేష్ లడ్డూ రూ.11లక్షల31 వేలు

రికార్డు: ఎర్రగడ్డ గణేష్ లడ్డూ రూ.11లక్షల31 వేలు

పంజాగుట్ట, వెలుగు: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఏడోరోజు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గణేష్ వేలం రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఎర్రగడ్డలోని కల్పతరు రెసిడెన్సీలో 2024, సెప్టెంబర్ 12న గణేశ్​లడ్డూకు వేలం పాట నిర్వహించగా రికార్డు ధర పలికింది. స్థానికంగా ఉండే తోట రాజేశ్​రూ.11.31 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు. స్వామివారి కండువా, పంచలు వేలం వేయగా రూ.4.39 లక్షలకు రేవంత్ రెడ్డి వ్యక్తి  దక్కించుకున్నాడు.