ఇండోనేషియాలో గురువారం (ఏప్రిల్ 2, 2026) భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియా తీరంలో రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఒకరు చనిపోయారు. 75 సెంటీమీటర్ల (2.5 అడుగుల) ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. ఇండోనేషియా, ఫిలిపిన్స్, మలేషియాకు సునామీ హెచ్చరికను జారీ చేశారు. తెల్లవారుజామున సులవేసి, మలుకు ద్వీప సమూహాల మధ్య మొలుక్కా సముద్రంలో 35 కిలోమీటర్ల తక్కువ లోతులో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
WATCH: Building violently shakes, with objects falling around in Indonesia after a powerful earthquake hit the Molucca Sea. pic.twitter.com/sGNzF6Z7qk
— Resist Wire (@ResistWire) April 1, 2026
ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని మనడో నగరంలో ఒక భవనం కూలిపోవడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల (621 మైళ్ల) పరిధిలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాల వెంబడి సునామీ అలలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. భూకంపం సంభవించిన అరగంటలోనే సులవేసి ద్వీపానికి ఉత్తరాన ఉన్న నార్త్ మినాహాసాలో 75 సెంటీమీటర్ల వరకు, బిటుంగ్‌లో 20 సెంటీమీటర్ల వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.
ఉత్తర మలుకు ప్రావిన్స్‌లో కూడా ముప్పై సెంటీమీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడటంతో స్థానికలు బెంబేలెత్తిపోయారు. ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. దేశ భూభాగం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పై ఉండటమే ఇందుకు కారణం. 2004లో వచ్చిన సునామీ, భూకంపం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.3 లక్షల మంది చనిపోయారు. ఇందులో ఇండోనేసియాలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి.
