ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద నీరు

ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద నీరు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. ఎగువన కురిసిన వర్షాలతో పాటు బాబ్లీ నుంచి వస్తున్న వరదలతో ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో మొత్తం 90.31 టీఎంసీలకు గాను శనివారం ఉదయానికి 24.62 టీఎంసీల నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకు 1,192 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 452 క్యూసెక్కుల వరద వస్తోంది. మేడిగడ్డకు 13,870 ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండగా 14,210 క్యూసెక్కులను వదులుతున్నారు. సీతమ్మసాగర్‌‌‌‌కు 17,044 క్యూసె క్కుల ఇన్‌‌‌‌ఫ్లో ఉండగా, అంతే నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌‌‌‌లో ఆల్మట్టి డ్యామ్‌‌‌‌కు 3,691 క్యూసెక్కులు, తుంగభద్రకు 6,255 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది.