కరీంనగర్‌‌‌‌‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌కు అప్లికేషన్ల వెల్లువ

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌కు అప్లికేషన్ల వెల్లువ

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌కు అప్లికేషన్లు వెల్లువలా వచ్చాయి. 339 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ బల్దియా పరిధిలోని తమ డివిజన్‌‌‌‌లో సమస్యలు పరిష్కరించాలని శ్రీరాంనగర్ కాలనీవాసులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం గ్రీవెన్స్‌‌‌‌లో దరఖాస్తు ఇచ్చారు. 

హుజూరాబాద్‌‌‌‌లోని 23వ వార్డులో బేడ, బుడగ  జంగాల  కాలనీలో  సీసీరోడ్డు,  డ్రైనేజీ లైన్లు, మిషన్ భగీరథ  పైప్ లైన్లు,  వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్‌‌‌‌‌‌‌‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌‌‌‌బాబు, తదితరులు పాల్గొన్నారు. 

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి వెంటనే సమస్యలను పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్లు లత, రాజగౌడ్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 43 ఫిర్యాదులను స్వీకరించారు. 

ప్రజావాణి అర్జీలు పెండింగ్‌‌‌‌లో పెట్టవద్దు 

రాజన్న సిరిసిల్ల,వెలుగు: ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్‌‌‌‌లో పెట్టొద్దని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు.  కలెక్టరేట్‌‌‌‌లో ఆమె  ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణికి మొత్తం 86 అర్జీలు వచ్చాయని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్ నగేశ్‌‌‌‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీవో శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు.