ఈటల భూవివాదంపై మొదలైన విచారణ..

ఈటల భూవివాదంపై మొదలైన విచారణ..

మంత్రి ఈటల రాజేందర్ భూవివాదంపై విచారణ మొదలైంది. రాత్రి కేసీఆర్ ఆదేశాలివ్వడంతో.. తెల్లారేలోపే విచారణ మొదలు పెట్టారు అధికారులు. అచ్చంపేటలో విచారణ ప్రారంభించిన రెవెన్యూ అధికారులు... రైతుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇక ఈటల ఇంటికి ఉదయం నుంచే బీసీ సంఘాల నేతల క్యూ కట్టారు. మరోవైపు హుజురాబాద్ నుంచి ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యుల కుట్రలో భాగంగానే మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన అభిమానులు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజాభిమానం ఉన్న ఈటలను తప్పించాలనే కుట్రలో భాగమే భూకబ్జా ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జా ఆరోపణలు నేపథ్యంలో ఈటలకు సంఘీభావం తెలిపేందుకు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ తరలివస్తున్నారు ఈటల అభిమానులు.