ఆడుకునే బండిపై గణపతిని నిమజ్జనానికి తీసుకొచ్చిన బుడ్డోడు

ఆడుకునే బండిపై గణపతిని నిమజ్జనానికి తీసుకొచ్చిన బుడ్డోడు

జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనంలో ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఓ ఐదేళ్ల బుడ్డోడు... తాను ఆడుకునే కారునే వాహనంగా చేసుకుని వినాయకుణ్ని నిమజ్జనానికి తీసుకుని రావడం అందరినీ ఆకట్టుకుంది. దీంతో పలువురు అతడితో సెల్ఫీలు దిగగా... జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి దగ్గరుండి ఆ బాలుడు తీసుకొచ్చిన వినాయకుణ్ని నిమజ్జనం చేయించారు.