హిస్టారికల్ టచ్ ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

హిస్టారికల్ టచ్ ఉన్న  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన చిత్రం  ‘హిడింబ’. నందితా శ్వేత హీరోయిన్. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. జులై 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ‘హైబ్రిడ్ జానర్‌‌‌‌లో డిఫరెంట్ మూవీ చేయాలని చాలా కాలంగా ఉంది. ఇప్పటివరకు  తాతలు, తండ్రుల ద్వారా కేవలం వినడమే తప్ప చరిత్రలో ఎక్కడా రాసివుండని కొన్ని అంశాలు ఇందులో ఉంటాయి. దానికి కొంత ఫిక్షన్ కలిపి, ట్రెండ్‌‌కి తగ్గట్టు తీసిన సినిమా ఇది. ఇందులో ఒక తెగ వుంది. ఆ తెగకి హిడింబాసురుడి లక్షణాలు కలిగివుంటాయి. అందుకే ‘హిడింబ‘ అనే టైటిల్  పెట్టాం. ఇదొక హిస్టారికల్ టచ్ ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.  ఇన్వెస్టిగేషన్ అంతా ప్రజంట్‌‌లోనే జరుగుతుంది.

 కానీ దీనికి లింక్ 1908 నుంచి కాస్త లోతైన కథ ఉంటుంది. ఇందులో చూపించే హిస్టరీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌‌ బ్యాంగ్‌‌లో చాలా సర్‌‌‌‌ప్రైజ్ అవుతారు. సెకెండ్ హాఫ్ అంతా చాలా ఎంగేజింగ్‌‌గా ఉంటుంది. కేరళ, అండమాన్‌‌లో వచ్చే సీన్స్   ఎక్సయిటింగ్‌‌గా ఉంటాయి. టెక్నికల్‌‌గా చాలా ఇంపాక్ట్ ఫుల్‌‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం అశ్విన్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. నిర్మాతల వైపు నుంచి కూడా నాకు పూర్తి స్వేచ్ఛ దొరికింది. ఇక.. ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌లోనే మరో సినిమా  చేస్తున్నా.  మరో  రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.