గడ్డి తగులబెడుతుండగా.. మంటలు అంటుకొని వృద్ధుడు సజీవదహనం..నల్గొండ జిల్లా ఈదులగూడలో ఘటన

గడ్డి తగులబెడుతుండగా.. మంటలు అంటుకొని వృద్ధుడు సజీవదహనం..నల్గొండ జిల్లా ఈదులగూడలో ఘటన

హాలియా, వెలుగు : పొలంలో గడ్డిని తగులబెడుతుండగా మంటలు అంటుకొనిఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని ఈదులగూడ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బద్రి రామచంద్రం (65) తన వ్యవసాయ పొలంలో గడ్డిని శుభ్రం చేసేందుకు సోమవారం ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో తొలగించిన గడ్డిని ఒక చోట చేర్చి నిప్పు పెట్టాడు. 

గాలి తీవ్రత కారమంగా మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో గమనించిన రామచంద్రం వాటిని ఆర్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పొగ కారణంగా అస్వస్థతకు గురై స్పృహ తప్పి మంటల్లో పడిపోయాడు. స్థానికులు గమనించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.