కోమటిరెడ్డి బ్రదర్స్తో ఆగమైన ఉమ్మడి నల్గొండ

కోమటిరెడ్డి బ్రదర్స్తో ఆగమైన ఉమ్మడి నల్గొండ

నల్గొండ జిల్లా : కోమటిరెడ్డి బ్రదర్స్తో ఉమ్మడి నల్గొండ  జిల్లా అభివృద్ధి 20 ఏళ్లుగా వెనక్కి వెళ్ళిందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చండూర్ లో మీడియాతో మాట్లాడుతూ.. గట్టుప్పల్ మండలం వెనకబాటుకు కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డేనని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. గెలిచిన 3 సంవత్సరాల్లో మునుగోడు ప్రజలకు ఏం పని చేయలేదన్నారు. మునుగోడు ప్రజలు చైతన్య వంతులని రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మరని తెలిపారు.