జగిత్యాలలో ఘోరం.. భార్యాభర్తలను ఢీ కొన్న గుర్తు తెలియని వాహనం..

జగిత్యాలలో ఘోరం.. భార్యాభర్తలను ఢీ కొన్న గుర్తు తెలియని వాహనం..

జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల పట్టణ శివార్లలో నిజామాబాద్ జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు వద్ద గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న మంచిర్యాలకు చెందిన ఇండ్ల మోహన్, లత దంపతుల్లో భార్య లత అక్కడికక్కడే మృతి చెందింది.

భర్త హెల్మెట్ ధరించినందుకు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. వీరిద్దరు నిజామాబాదులోని తమ కుమార్తే బీ.డీ.ఎస్ చదువుతున్న కళాశాలలో ఫీజు చెల్లించి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.