క్రికెట్‌లో చరిత్రలో తొలిసారి.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అరుదైన బాల్

క్రికెట్‌లో చరిత్రలో తొలిసారి.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అరుదైన బాల్

మ్యాచ్ లో సిక్సర్లు తరచూ చూస్తూనే ఉంటాం. బౌలర్లు అరుదుగా నో బాల్స్ వేయడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇక హిట్ వికెట్ ద్వారా ఔట్ కావడం ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మూడు ఒక్క బంతిలో జరిగితే ఆశ్చర్య పోవడం గ్యారంటీ. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ సంఘటన జరిగింది. 

 ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మహిళా బౌలర్ క్లాస్ వేసిన 48 ఓవర్లో ఆశ్చర్య సంఘటన జరిగింది. అలెన్ కింగ్ బ్యాటింగ్ చేస్తుండగా.. క్లాస్ బంతిని నడుము కన్నా ఎత్తుగా నో బాల్ వేసింది. ఈ బంతిని ఆడటానికి ప్రయతించిన కింగ్.. వికెట్ల వెనక్కి వెళ్లి సిక్సర్ కొట్టింది. ఈ క్రమంలో వికెట్లను తగిలి హిట్ వికెట్ అయింది. అయితే అది కాస్త నో బాల్ కావడంతో అంపైర్ ఔట్ గా ప్రకటించలేదు. దీంతో ఒక్క బంతికే నో బాల్, సిక్సర్, హిట్ వికెట్ అన్ని రెప్పపాటులో ఒక్కసారిగా జరిగిపోయాయి.

డగౌట్ లో ఉన్న ఆసీస్ క్రికెటర్లందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాటర్ అలెన్ కింగ్ కు ఏమైందో అర్ధం కాలేదు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో  ఆస్ట్రేలియా 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లను 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. అలిస్సా హీలీ (60), బెత్ మూనీ (82*) హాఫ్ సెంచరీలు చేశారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా టార్గెట్ 31 ఓవర్లలో 238 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 24.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.