ఆనంద్‌ దేవరకొండ కొత్త సినిమా షురూ.. ఆ హీరోయిన్తో డ్యూయెట్ గురూ..

ఆనంద్‌ దేవరకొండ కొత్త సినిమా షురూ.. ఆ హీరోయిన్తో డ్యూయెట్ గురూ..

యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda)..బిఫోర్ బేబీ ఆఫ్టర్ బేబీ అన్నట్టు సినీ కెరీర్ సాగుతుంది. చిన్న సినిమాగా రిలీజైన బేబీతో క్లాసిక్ హిట్​ అందుకున్న ఆనంద్ దేవరకొండ మరో కొత్త సినిమాని షురూ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ  గురువారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. భారీ చిత్రాల బ్యానర్ అయిన..స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత జ్ఞాన్ వెల్ రాజా నిర్మిస్తోన్న ఈ మూవీకి డ్యూయెట్ (Duet) అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ శిష్యుడు మిథున్ వరదరాజ కృష్ణన్( Mithun Varadaraja Krishnan) డ్యూయెట్ మూవీతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి  హీరో విజయ్ దేవరకొండతో పాటు ముఖ్య అతిధులుగా విచ్చేసిన..డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ కొట్టారు.

బేబీ డైరెక్టర్ సాయిరాజేశ్, ప్రొడ్యూసర్  జ్ఞానవెల్ రాజా, కో ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్..డ్యూయెట్ స్క్రిప్ట్​ను డైరెక్టర్ మిథున్​కు అందజేయగా..ఫస్ట్ షాట్​ను డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్ట్​ చేశారు. ఇక ఆనంద్ దేవరకొండ అమ్మ నాన్నలు గోవర్ధన్ దేవరకొండ మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ALSO READ : ఇట్స్ ఆఫీసియల్!..మెగాస్టార్ 156 టైటిల్ లీక్

డ్యూయెట్ అనే టైటిల్ తో ఆకట్టుకుంటోన్న ఆనంద్ దేవరకొండ..మరో సక్సెస్ ను అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆనంద్ కు జోడీగా అశోకవనంలో అర్జున కల్యాణం ఫేమ్‌ రితికా నాయక్‌ (Ritika Nayak) నటించనుంది. విశ్వక్ సేన్ తో నటించిన రితికా పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఫామ్లో ఉన్న ఆనంద్కు మరో..బేబీ లా ఉంటుందో..లేదో చూడాలి మరి. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలూ అందిస్తున్నారు.