ఇడ్లీ బామ్మకు ఇంటి స్థలమిచ్చిన ఆనంద్ మహీంద్రా

ఇడ్లీ బామ్మకు ఇంటి స్థలమిచ్చిన ఆనంద్ మహీంద్రా

బయటకెళ్లి టిఫిన్ చేస్తే ప్లేట్ ఇడ్లీ ధర తక్కువలో తక్కువ రూ. 30 ఉంటుంది. కానీ కోయంబత్తూరుకు చెందిన కమలాథల్ కేవలం రూ. 1కే ఇండ్లీ అందిస్తూ.. 30 సంవత్సరాలుగా ఎంతోమంది ఆకలి తీరుస్తుంది. దాంతో ఆమె ‘ఇడ్లీ అమ్మ’ గా 2019లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె చేస్తున్న సేవ గురించి తెలిసిన ఆనంద్ మహీంద్రా.. ఆమెకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. అందులో భాగంగా వారం కిందట ఆనంద్ మహీంద్రా ఆమె ఇంటి నిర్మాణం కోసం కమలాథల్ పేరు మీద కొంత స్థలం రిజిస్ట్రేషన్ చేయించాడు. అంతేకాకుండా.. తన కంపెనీకి చెందిన నిర్మాణ సంస్థ త్వరలోనే ఇంటిని నిర్మిస్తుందని కూడా తెలిపాడు. ఆ ఇంటిలో టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకునేలా నిర్మిస్తామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. కమలాథల్ గురించి 2019లో సోషల్ మీడియాలో తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. మొదట ఆమెకు గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలనుకున్నాడు. అయితే ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుసుకున్న స్థానిక భారత్ గ్యాస్ కంపెనీ.. తమ కంపెనీ తరపున కమలాథల్‌కు ఉచితంగా కనెక్షన్ ఇచ్చింది. ఇది తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. గ్యాస్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆనంద్ మహీంద్రా ఔదార్యం చూసిన నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.