50ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర రూ.16వేలేనట

50ఏళ్ల క్రితం అంబాసిడర్ కారు ధర రూ.16వేలేనట

ఒకప్పటి అంబాసిడర్ కారు గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. దాని ఉత్పత్తి 2014లోనే ఆగిపోయినా.. అంబాసిడర్ అంటే చాలామందికి ఇప్పటికీ గుర్తొచ్చేది అత్యంత సంపన్నులు, రాజకీయ నాయకులే. అయితే గత 50ఏళ్ల క్రితం దీని ధర ఎంతో తెల్సా..? కేవలం రూ.16వేలేనట. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తెలియజేశారు. జనవరి 25, 1972 లో వచ్చిన ఓ వార్తా కథాంశాన్ని షేర్ చేశారు. ఈ న్యూస్ పేపర్లో కార్ల ధరలు పెరిగాయన్న వార్తను చూపిస్తూ... అంబాసిడర్ ధర రూ.127పెరిగి రూ.16,946 రూపాయలకు చేరిందని ఉంది.

దాంతో పాటు ఫియట్ కారు ధర రూ.259 పెరిగి  రూ.15,946కి పెరిగిందని ఆ న్యూస్ పేపర్ లో ప్రచురితమైంది. ఈ వార్త విని షాక్ అయిన ఆనంద్ మహీంద్రా.. ఇది తనను సండే మెమోరీస్ లోకి తీసుకెళ్లిందన్నారు. తాను జేజే కాలేజీలో ఉన్నపుడు బస్సులో కాలేజీకి వెళ్లేవాడినని చెప్పారు. కానీ, తన అమ్మ అప్పుడప్పుడు తన నీలిరంగు ఫియట్ కారును నడపడానికి అనుమతించేదని, అయితే ఆ కారు ఇంత విలువైనదని తనకు అప్పుడు తెలియదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.