
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరో సారి పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదన్నారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. అంతేకాదు, లాక్‌డౌన్ పొడిగింపుతో వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. మళ్ళీ లాక్‌డౌన్ పొడిగింపుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన ట్వీట్లను ప్రస్తావించారు ఆనంద్ మహీంద్రా. లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కనుక దాని ప్రతికూల ప్రభావం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. సమగ్రమైన విధానాన్ని రూపొందించి లాక్‌డౌన్ ఎత్తివేయడమే సరైన నిర్ణయమన్నారు.