ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ

ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ
  • కంటి మందులో ప్రమాణాలు కనిపించడం లేవంటున్న ప్రభుత్వం
  • కేంద్రం ప్రభుత్వం పరిశోధన చేయాలన్న పిటిషనర్లు
  • విచారణ రెండు వారాలకు వాయిదా

అమరావతి: కరోనా నివారణలో భాగంగా ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుల్లో కంటి చుక్కల మందుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కంటి చుక్కల మందు విషయంలోనే ఏపీ ప్రభుత్వ ఆయుర్వేద విభాగం నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలసిందే. ఆనందయ్య తయారు చేసిన కంటి చుక్కల మదును 15 సంస్థలతో తనిఖీ చేయగా.. ‘బాగా లేదు’ అనే నివేదికలు వచ్చాయని ప్రభుత్వ తరపున న్యాయవాది తెలియజేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని ఆనందయ్య తరపు న్యాయవాది కోరారు. మరో వైపు ఈ మందుపై కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలని పిటిషనర్లు కోరారు. దీంతో పిటిషన్ల వాదనలపై హైకోర్టు ధర్మాసనం విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.