అదిరింది పో.. సముద్రంలో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

 అదిరింది పో..  సముద్రంలో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటు వేడుకలు కొనసాగనున్నాయి. మే29నుంచి జూన్ 1 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కిలో మీటర్ల మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్‌బీర్, ధోనీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జూలై 6-12 మధ్య ముంబైలో పెళ్లి జరగనుంది. కాగా ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి తొలి ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది.

మే 29, బుధవారం రోజున  వెల్‌కమ్‌ లంచ్‌తో వేడుక ప్రారంభం కానుంది. డ్రెస్ కోడ్ క్లాసిక్ క్రూయిజ్. ఆ తరువాత 'స్టార్రీ నైట్' థీమ్ ఈవెంట్ జరుగుతుంది. దీనికి డ్రెస్ కోడ్ వెస్ట్రన్ ఫార్మల్స్ ఉంటుంది.  ఇక  మే 30, గురువారం రోజున అతిథులందరూ రోమ్‌లో దిగుతారు. అప్పుడు టూరిస్ట్ చిక్ డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. సాయంత్రం 'టోగా పార్టీ'తో రెండో రోజు ముగుస్తుంది. మే 31, శుక్రవారం రోజున థీమ్ 'వీ టర్న్స్ వన్ అండర్ ది సన్', 'లే మాస్క్వెరేడ్' అండ్ 'పార్డన్ మై ఫ్రెంచ్'. ఇది క్రూయిజ్‌లో ఆఫ్టర్‌పార్టీతో ముగుస్తుంది. చివరి రోజైన జూన్ 1 శనివారం రోజున  థీమ్ 'లా డోల్స్ వీటా'. అతిథులు ఇటాలియన్ సమ్మర్ డ్రెస్ కోడ్‌ను అనుసరించాల్సి ఉంటుంది.