
ప్రశాంత్ కార్తీ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘అనంత’. మధుబాబు దర్శకుడు. రితిక చక్రవర్తి హీరోయిన్. ఈ నెల 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ ‘ధృవ, చెక్, కొండా చిత్రాల్లో నటించిన నాకు హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. దర్శకుడు మధుబాబు చెప్పిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథ నచ్చడంతో దీన్ని నేనే నిర్మించా.
టైమ్ ట్రావెల్ జానర్‌లో మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ఇది. ‘మనిషి పుట్టిన మరుక్షణం నుంచే ఆ శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంటుంది’ అనే డైలాగ్ సినిమా సోల్ ఏంటో చెబుతుంది. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి కంటెంట్ ఇప్పటివరకు రాలేదు. కొత్త దర్శకుడైనా డిఫరెంట్ స్టోరీ లైన్‌తో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు థియేటర్స్ నుండి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్‌ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నాం’ అన్నాడు.