పుష్ప-1సినిమాలో.. ‘సామీ.. సామీ’ పాట వినే ఉంటారు.. కన్నడలో ఈ పాట పాడిన సింగర్ పెళ్లి చేసుకుంది..!

పుష్ప-1సినిమాలో.. ‘సామీ.. సామీ’ పాట వినే ఉంటారు.. కన్నడలో ఈ పాట పాడిన సింగర్ పెళ్లి చేసుకుంది..!

‘ఆటగదరా శివ’ సినిమాలో ‘‘ఎట్టాగయ్య శివ.. శివా’’  అనే పాట వినే ఉంటారు. కేజీఎఫ్ సినిమాలో ‘‘తరగని బరువైనా వరమని అనుకుంటూ’’ పాట ఎంత వినసొంపుగా ఉంటుందో కద.. ఇలాంటి ఎన్నో గొప్ప పాటలను పాడిన సింగర్ అనన్య భట్ పెళ్లి చేసుకుని సింగిల్ లైఫ్కు గుడై చెప్పేసింది. సంగీత దర్శకుడు, డ్రమ్మర్ అయిన మంజును ఆమె పెళ్లి చేసుకుంది. సంగీత ప్రపంచంలోనే అనన్య భట్కు ఇలా తోడు దొరకడం విశేషం. 

తిరుపతిలో నవంబర్ 9న కొద్ది మంది ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో మంజు, అనన్య భట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అరుణ్ గురూజీ ఈ జంటకు పెళ్లి చేశారు. అనన్య భట్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో కొత్త జంటకు నెటిజన్లు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనన్య భట్ ఎన్నో మర్చిపోలేని పాటలు పాడింది. 2017లో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఆమె సొంతూరు కర్నాటకలోని మైసూర్. బెంగళూరులో సెటిలైంది.

►ALSO READ | RT 76 Glimps: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది

భక్తి పాటలు, వేదాంత థోరణిలో సాగే పాటలే కాదు.. మంచి మెలోడీస్ కూడా ఆమె గాత్రం నుంచి జాలువారాయి. కేజీఎఫ్2లో మెహబూబా సాంగ్, పుష్ప-1 సినిమాలో ‘సామి.. సామి’ సాంగ్ కన్నడలో పాడింది ఈ సింగరే. ‘ఆటగదరా శివ’ సినిమాలో ‘ఎట్టాగయ్యా శివ.. శివా’ సాంగ్తో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పాడిన తొలి పాటతోనే ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాల్లో దాదాపు చాలా పాటలు ఆమెనే పాడింది. ఆమె పాడిన ప్రతీ పాటకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. 2025లో షష్టిపూర్తి సినిమాలో ‘ఏదో.. ఏ జన్మలోదో’ పాట కూడా అనన్య భట్ పాడటం విశేషం. ఈ పాటకు ఇళయరాజా సంగీతం అందించగా, ఎం.ఎం.కీరవాణి లిరిక్స్ అందించారు.