RT 76 Glimps: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది

RT 76 Glimps: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ, అంతేస్థాయిలో వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నారు. ఇటీవలే మాస్ జాతరతో వచ్చిన రవితేజ, ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో.. తనకి అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనర్తో ఆడియన్స్ని పలకరించనున్నాడు. అందుకు తగ్గ కథను డైరెక్టర్ కిషోర్ తిరుమల దగ్గర పట్టేసి, ఈ సారి హిట్ కొట్టబోతున్నారు. ఇవాళ (2025 నవంబర్ 10న) ఈ క్రేజీ కాంబో నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. 

SLV సినిమాస్ బ్యానర్‌‌‌‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్ వినడానికి కాస్త కొత్తగా, వింతగా ఉండటంతో.. భలే గమ్మత్తయిన టైటిల్ అంటూ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా టైటిల్తో పాటు రిలీజ్ చేసిన గ్లింప్స్ క్రేజీగా ఉంది. 

రవితేజ మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌‌‌‌తో కూడిన ఫుల్ లెంగ్త్  ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషనల్ హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి రవితేజకి జోడీగా నటిస్తున్నారు. వీరితో రవితేజ చేసిన ఫన్, రొమాంటిక్ విజువల్స్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాతో అయిన, రవితేజ హిట్ కొడుతాడో లేదో చూడాలి. 

ఇకపోతే, ఇది రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో 76వ చిత్రం. ప్రస్తుతం వరుస షెడ్యూల్స్తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చెప్పట్టారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.