సోషల్​ మీడియాలో టాలెంట్ చూపిస్తోంది

సోషల్​ మీడియాలో టాలెంట్ చూపిస్తోంది

మల్లేశం సినిమాతో ఆకట్టుకున్న అనన్య నాగల్ల సెల్ఫ్​ ప్రమోషన్​ విషయంలో తడబడుతోంది. సోషల్​ మీడియాలో ఆమె టాలెంట్​ చూసిన ఫ్యాన్స్​ ఇదే మాట అంటున్నారు. పవన్​ కళ్యాన్​ ‘వకీల్​ సాబ్’​లో చాన్స్​ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బ్యూటీ.. అంతగా ప్రాధాన్యం లేని పాత్ర చేసి కెరీర్​ను కష్టాల్లో పెట్టుకుంది. ఆ తర్వాత అన్నీ సెకండ్​ లీడ్​ రోల్స్, సైడ్​ క్యారెక్టర్లే అనన్యను పలకరిస్తున్నాయి. 

ఇటీవల వచ్చిన శాకుంతలం.. ఇవాళ విడుదలైన ‘మళ్లీపెళ్లి’ సినిమాలోనూ అదే జరిగింది. సోషల్​ మీడియాలో హాట్​ ఫొటో షూట్లతో ట్రెండింగ్​లో ఉండే అనన్యకు యూత్​లో మంచి ఫాలోయింగ్​ ఉంది. ఆకట్టుకునే ఫీచర్స్​ ఉండి కూడా సినిమాల విషయంలో శ్రద్ధ పెట్టడంలేదంటున్నారు ఫ్యాన్స్​. ఇప్పటికైనా తన టాలెంట్​ కు తగిన సినిమాను ఎంచుకోవాలంటూ ఆమెకు సూచిస్తున్నారు.