దోస్త్అస్త్ర తో అనన్య పాండే

దోస్త్అస్త్ర తో అనన్య పాండే

స్టార్ హీరోయిన్లలో ఒకరైన అనన్య పాండేకు కొత్త బెస్ట్ ఫ్రెండ్ దొరికాడట. ఈ విషయాన్నే ఆమే స్వయానా వెల్లడించింది.. ఇంతకీ ఆ కొత్త బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయానికొస్తే.. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న రణ్ బీర్ కపూర్ తో కలిసి ఓ సెల్ఫీ ఫొటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ పిక్స్ లలో ఒకటి రణ్ బీర్ మీద వాలుతున్నట్టుగా, మరొక పిక్ లో రణ్ బీర్ కన్ను కొడుతున్నట్టుగా ఉన్న ఫొటోలను చూడవచ్చు. ఈ ఫొటోలతో పాటు "కొత్త రోజు, కొత్త షూట్, కొత్త బెస్ట్ ఫ్రెండ్ అనే క్యాప్షన్ ను, #దోస్త్అస్త్ర అనే ట్యాగ్ ను అనన్య జత చేసింది.

అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించిన ఖో గయే హమ్ కహాన్‌లో సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్‌లతో కలిసి అనన్య నటిస్తుండగా... తాను మరో మూడు ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నానని, దాని గురించి పెద్దగా మాట్లాడలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వచ్చిన బ్రహ్మాస్త్రలో తన అద్భుతమైన నటనతో అలరించిన రణబీర్ కపూర్ హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు కిట్టీలో తన అద్భుతమైన ప్రదర్శనను కనబర్చేందుకు రెడీగా ఉన్నాడు. శ్రద్ధా కపూర్, సందీప్ రెడ్డి వంగా యొక్క యానిమల్‌తో పాటు రష్మిక మందన్నతో కలిసి రణ్ బీర్ కనిపించనున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya ?? (@ananyapanday)