అఖిల్ మూవీలో అనన్య పాండే ఐటమ్ సాంగ్

అఖిల్ మూవీలో అనన్య పాండే ఐటమ్ సాంగ్

‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. ప్రస్తుతం  బాలీవుడ్‌‌లో వరుస చిత్రాలతో మెప్పిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత ఓ స్పెషల్ సాంగ్‌‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోందట. అక్కినేని  అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశాడట దర్శకుడు కిషోర్ అబ్బూరి. ఈ పాట కోసం అనన్యను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించడానికి మేకర్స్  ప్లాన్ చేస్తున్నారట. 

ఈ సాంగ్ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.  దీనిపై చిత్రయూనిట్‌‌ నుంచి అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న 6వ చిత్రమిది. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తోంది.  ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.  అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.