Ananya Panday: ట్రెడిషనల్ లుక్‌లో అనన్యా పాండే మెరుపులు.. వైరల్ అవుతున్న పట్టు చీర ఫొటోలు!

Ananya Panday: ట్రెడిషనల్ లుక్‌లో అనన్యా పాండే మెరుపులు.. వైరల్ అవుతున్న పట్టు చీర ఫొటోలు!

 హిందీ, తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న నటి అనస్య పాండే. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2019లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచియమైంది.  మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది. పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైగర్ షాప్, తారా సుతారియా, ఆదిత్య సీల్ కీలక పాత్రలు పోషించారు. 

ఆ తర్వాత 'పతి పత్నీ ఔర్ వో' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక 2022లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'లైగర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ.  భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజీలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ అమ్మడికి మళ్లీ తెలుగులో అవకాశాలు లభించలేదు. 

ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నా..  నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ గ్రామర్ ఫోటోలతో హీట్ పుట్టించేస్తోంది. లేటెస్ట్ గా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ సిల్క్ శారీ.. దానికి కాంబి‍నేషన్ లో ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ధరించి తన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు మీడియాలో వైరల్ గా మారాయి.  ముద్దుగుమ్మ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ananya 🌙 (@ananyapanday)