Anaya Bangar: గతంలో పురుషుల క్రికెట్ ఆడి, ఆ తర్వాత స్త్రీగా మారిన ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనయా బంగార్ అంశం ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2024 చివర్లో జెండర్ ఛేంజ్ చేసుకున్న అనయా.. గతంలో యశస్వి జైస్వాల్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ముంబై అండర్-19 టీమ్‌లో ఆడింది. ఆస్ట్రేలియాలో మహిళల ప్రీమియర్ (క్లబ్) క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా, టెస్టోస్టెరాన్ లెవల్స్ నిర్ణీత పరిమితిలో (10 nmol/L కంటే తక్కువగా) 12 నెలల పాటు ఉంటే మార్చి 2027 నుంచి ఆస్ట్రేలియాలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడవచ్చని తెలిపింది. కానీ ఈ ఏడాది ఆఖరులో జరిగే డబ్ల్యూబీబీఎల్ 2026 (WBBL) లో ఆడేందుకు మాత్రం ఆమెకు అర్హత లభించలేదు.
ట్రాన్స్‌జెండర్లకు చోటివ్వడంపై మరిజేన్ కాప్ ఫైర్:
మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లకు చోటివ్వడంపై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్, డబ్ల్యూబీబీఎల్ స్టార్ ప్లేయర్ మరిజేన్ కాప్ తీవ్రంగా మండిపడింది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని తప్పుపడుతూ.. ఇది పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని సోషల్ మీడియా వేదికగా విమర్శించింది. పురుషుల శరీర నిర్మాణం నుంచి వచ్చిన ప్లేయర్లకు మహిళల క్రికెట్‌లో అదనపు శారీరక బలం (Unfair advantage) ఉంటుందని, ఇది మిగతా మహిళా ప్లేయర్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాప్ చెప్పుకొచ్చింది.
సైంటిఫిక్ ప్రూఫ్‌తో అనయా కౌంటర్:
మరిజేన్ కాప్ విమర్శలపై అనయా బంగార సైంటిఫిక్ ఆధారాలతో స్పందించింది. మాంచెస్టర్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ చేసిన 12 వారాల రీసెర్చ్ రిపోర్టును ఆమె ఉదాహరణగా చూపింది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) తీసుకున్న ఏడాది తర్వాత నా ఫిజికల్ కెపాసిటీ సాధారణ మహిళా అథ్లెట్లతో సమానంగా మారిందని సైంటిఫిక్ టెస్టుల్లో నిరూపితమైంది. కాబట్టి నాకు గ్రౌండ్ లో ఎలాంటి ప్రత్యేక శారీరక ప్రయోజనం ఉండదని అనయా స్పష్టం చేసింది.
ALSO READ : T20 కెప్టెన్సీ పోయింది.. జట్టులో చోటూ లేదు
ఐసీసీ నిషేధం పక్కన బెడితే.. ఆస్ట్రేలియాలో కొత్త చర్చ:
కెనడాకు చెందిన డానియెల్ మెక్‌గాహే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత, 2023లోనే అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లపై ఐసీసీ (ICC) పూర్తి నిషేధం విధించింది. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ దేశవాళీ స్థాయిలో అనయా బంగార్ కు ఇచ్చిన ఈ అనుమతి, క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ల భాగస్వామ్యంపై మరోసారి సరికొత్త చర్చకు తెరలేపింది.
