
బిగ్ బాస్ 3 షో పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు యాంకర్ శ్వేతారెడ్డి. ఉత్తరాది సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. షో పేరిట అసాంఘీక కార్యకలాపాలు జరగుతున్నాయని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు శ్వేతారెడ్డి. బిగ్ బాస్ పేరుతో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందన్నారు. బిగ్ బాస్ షో లో జరిగే విషయాలు చెప్పేందుకే తాను ధైర్యంగా ముందుకొచ్చానన్నారు. బిగ్ బాస్ కు ఎంపికయ్యారంటూ ఏప్రిల్ ఒకరు ఫోన్ చేశారని చెప్పారు శ్వేతారెడ్డి. తర్వాత అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయాలంటూ తనకు ఫోన్ చేసి చెప్పారని ఆమె అన్నారు.