SL vs BAN: నాగిని డ్యాన్స్‌కు ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది: క్రికెట్ గ్రౌండ్‌లోకి 7 అడుగుల పాము

SL vs BAN: నాగిని డ్యాన్స్‌కు ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది: క్రికెట్ గ్రౌండ్‌లోకి 7 అడుగుల పాము

క్రికెట్ స్టేడియంలోకి పాము రావడం సహజమే అయినా.. పదే పదే ఒకే చోట కనిపించటం ఆటగాళ్లను ఉలిక్కిపడేలా చేస్తోంది.  కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాములు రావడం చాలా సాధారణమైపోయింది. తాజాగా ఈ స్టేడియంలోని గ్రౌండ్ లోకి మరోసారి పాము కనిపించడం చర్చనీయాంశమైంది. కొలంబో వేదికగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో బుధవారం (జూలై 2) శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే జరిగింది. బంగ్లాదేశ్ ఛేజింగ్ సమయంలో 7 అడుగుల పాము గ్రౌండ్ లోకి రావడం వచ్చింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

ఓ వైపు ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతుండగా.. ఉన్నట్టుండి మైదానంలోకి పాము చొచ్చుకొచ్చింది. దీనివల్ల మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.అదృష్టవశాత్తు పాము వలన ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2023 లంక ప్రీమియర్ లీగ్‌లో  కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా గాలె టైటాన్స్, దంబుల్ల ఆరా టీమ్స్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఒక పాము అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ముగిసిన వారం లోపే అదే గ్రౌండ్ లో మరోసారి పాము కనిపించడం షాకింగ్ గా మారింది. 

ALSO READ | Wimbledon 2025: షూటింగ్‌కు బ్రేక్.. వింబుల్డన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ హీరోయిన్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి వన్డేలో బంగ్లాదేశ్ పై శ్రీలంక బంగ్లాదేశ్ 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అసలంక (106) సెంచరీతో చెలరేగితే మిగిలిన పెద్దగా అతనికి సహకరించలేదు. కుశాల్ మెండీస్ 45 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్ హసరంగా 8 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.