బెట్టింగ్ యాప్స్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన.. యాంకర్ శ్రీముఖి,నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన.. యాంకర్ శ్రీముఖి,నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సీఐడీ. నవంబర్ 21న మధ్యాహ్నం లక్డీకపూల్ లోని   సీఐడీ విచారణకు  హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి  హాజరయ్యారు.  ప్రస్తుతం ఈ ముగ్గురిని విచారిస్తోంది సీఐడీ. జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసింది నిధి అగర్వాల్. జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేసింది శ్రీముఖి.పలు గేమింగ్ యాప్స్,బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది యాంకర్ అమృత చౌదరి. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో లావాదేవీల వివరాలు, డాక్యుమెంట్ల వివరాలు సేకరించి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు సీఐడీ అధికారులు.

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన   సినీ ప్రముఖులు, సోషియల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లు, యుట్యూబర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 29 మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంది సీఐడీ సిట్. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి , ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణు ప్రియ , సిరి హనుమంతును విచారణ చేసింది సిట్. ఈ క్రమంలో ఇవాళ నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరిని విచారిస్తోంది సీఐడీ.

ఆర్థిక లావాదేవీల చిట్టాపై దృష్టి:

ప్రస్తుతం  సీఐడీ సిట్ అధికారులు దృష్టి అంతా ఆర్థిక లావాదేవీల చిట్టాపైనే ఉంది. ఈ ప్రమోషన్ల కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాల్లో జమ అయింది, హవాలా మార్గాల ద్వారా ఏమైనా చెల్లింపులు జరిగాయా అనే అంశాలపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రముఖులు కేవలం ప్రచార కర్తలుగానే ఉన్నారా, లేక వారికి అంతకుమించి ఏమైనా పాత్ర ఉందా అనే కీలక కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.