
నందిపేట, వెలుగు : మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలోని ఏడంతస్తుల పురాతన మేడ ఆదివారం రాత్రి నేలకొరిగింది.1942 లో గ్రామానికి చెందిన ఉత్తూర్ లచ్చయ్య అనే వైశ్యుడు దీన్ని నిర్మించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా అంతపెద్ద మేడ ఉండేది కాదు. దీంతో ఇది అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేదని చెబుతారు.
అప్పట్లో దానిలోకి ఎక్కాలంటే 10 పైసలు తీసుకుని రానిచ్చేవారట. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు తడిసిన మేడ ఆదివారం రాత్రి కూలింది. నెల రోజుల క్రితమే లచ్చయ్య కుటుంబీకులు ఆ భవనాన్ని ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. ఏడంతస్తుల మేడ నేలకువాలడంతో గ్రామస్తులు చేసేందుకు తరలివచ్చారు.