
హైదరాబాద్ : తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ లో నివాసముంటున్న బాల సుందరం(38) అనే వ్యక్తి కింగ్ కోటిలోని ఆంధ్రా బ్యాంక్ బ్రాంచిలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆదివారం బాల సుందరం సడెన్ గా సూసైడ్ చేసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెడ్ బాడీ దగ్గర సూసైడ్ నోట్ దొరికిందని.. తన చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ లో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్ట్ మార్టమ్ కోసం డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.