రాజధాని అమరావతి చట్టబద్దతపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. శనివారం ( మార్చి 28 ) ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అమరావతి చట్టబద్దత కల్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. తీర్మానంపై నాలుగు గంటల పాటు చర్చ జరిపి తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది కూటమి సర్కార్.
ఈ తీర్మానం సమన్వయ బాధ్యతలు ముగ్గురు మంత్రులకు అప్పగించింది ప్రభుత్వం. మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. రేపు ఉదయం సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానం తర్వాత మందగించిన అమరావతి పనులు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ సుమారు రెండేళ్ల తర్వాత ప్రవేశ పెడుతున్న తీర్మానంతో ఏమేరకు ఊపందుకుంటాయో వేచి చూడాలి.
