
అమరావతి : ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ష్రంగా తీర్చిదిద్దుతానన్న జగన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. మే-30న సీఎంగా ప్రమాణం చేయనున్న ఆయన ..ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్ గా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందని జగన్ అడిగినప్పుడు.. కనీసం 5 నుంచి 10 లక్షల మధ్య అవుతుందని ఎల్వీ చెప్పారట.
దీంతో జగన్ అలా అవడానికి వీలులేదు. రూ. 2 లక్షలకు మించకుండా ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడని వైసీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మునిసిపల్ స్టేడియం ఎలాగూ ప్రభుత్వానిదే.. కుర్చీలను మునిసిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. వచ్చే వారికి ప్రభుత్వ అతిధి గృహాల్లో బస ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ ఖర్చు ను తగ్గించుకునేందుకు జగన్ వేస్తున్న అడుగులు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి.