ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
V6 Velugu Posted on Jan 26, 2022
అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నిత్యం 10 వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. గత 24 గంటల్లో 46,143 శాంపిల్స్ పరీక్షించగా.. 13,618 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. విశాఖపట్నంలో అత్యధికంగా 1,791 మందికి కరోనా సోకగా.. అనంతపురంలో 1,650, గుంటూరులో 1,464, కర్నూలులో 1,409, నెల్లూరులో 1,409 కేసుల చొప్పున నమోదయ్యాయి.
వైరస్ కారణంగా తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 8,687 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,06,318 యాక్టివ్ కేసులున్నాయి.
For more news..
ప్లాస్టిక్ వస్తువులపై ఒమిక్రాన్ లైఫ్ 8 రోజులు
Tagged Andhra Pradesh, Corona Positive, New Cases, COVID-19 cases