తగ్గుతున్న నీటి నిల్వలు..  ఏపీకి నీటి గండం తప్పదా..?

తగ్గుతున్న నీటి నిల్వలు..  ఏపీకి నీటి గండం తప్పదా..?

మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత రెట్టింపవుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. మండే ఎండలకు తోడు నీటి ఎద్దడి ఇప్పుడు దేశ ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రజలు నీటి ఎద్దడితో సతమతం అవుతున్నారు. బెంగళూరులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తెలంగాణలో కూడా నీటికి ఇబ్బందులు తప్పవని సంకేతాలు వస్తున్నాయి. ఇక ఏపీలో కూడా నీటి కటకట ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు తగ్గటం, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే భూ ఉపరితలం వేడెక్కిన నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉదని, ఈ కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి తప్పదని నిపుణులు చెప్తున్నారు. నాగార్జున సాగర్ కెపాసిటీ 590 అడుగులు కాగా ప్రస్తుతం 519అడుగులుగా ఉందని, వేసవి ఆరంభంలోనే నీటి నిలువ తగ్గుముఖం పట్టడం చూస్తుంటే ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు.

ALSO READ :- Ajay Devgn Shaitan: ఫ‌స్ట్ డే కలెక్షన్స్తో కుమ్మేసిన సైతాన్..హార‌ర్ మూవీస్లో నంబ‌ర్ వ‌న్ ఇదే

నాగార్జున సాగర్ కి ప్రస్తుతం ఎగువ నుంచి ఎలాంటి ఇన్ ఫ్లో లేకున్నా కూడా 11,712 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 812 డుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. మార్చి ప్రారంభంలోనే ఇలా ఉంటే పోను పోను పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.