అద్భుతమైన10ఫీచర్లతో..15 స్మార్ట్ ఫోన్లకు.. ఆండ్రాయిడ్16 వచ్చేస్తుంది

అద్భుతమైన10ఫీచర్లతో..15 స్మార్ట్ ఫోన్లకు.. ఆండ్రాయిడ్16 వచ్చేస్తుంది

ఆండ్రాయిడ్ 16 విడుదల తేదీని గూగుల్ ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్ త్వరలో అనేక ఫోన్లకోసం జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ఆండ్రాయిడ్ షో గూగుల్ ఈ వార్తను వెల్లడించింది. ఇది టెక్ దిగ్గజం నుంచి ఫాస్టెస్ట్ వెర్షన్ ఇది. ఇప్పటికే అర్హత కలిగిన పిక్సెల్ మోడల్స్,ఇతర బ్రాండ్‌ల కోసం ఆండ్రాయిడ్ 16 బీటా 4 వెర్షన్ విడుదలైంది. అయితే జూన్ మధ్యలో విడుదల కానున్న కొత్త ఆండ్రాయిడ్16 స్థిరమైన అప్డేట్ కోసం గూగుల్ తన సొంత డివైజ్లకు ప్రాధాన్యత ఇస్తుంది.
జూన్‌లో ఆండ్రాయిడ్ 16 అప్డేట్ లను Google Pixel సిరీస్ లో అందించనుంది. కిందచూపబడిన మోడళ్లు త్వరలో కొత్త వెర్షన్‌ను అందుకోనున్నాయి.

  • పిక్సెల్ 6
  • పిక్సెల్ 6 ప్రో
  • పిక్సెల్ 6a
  • పిక్సెల్ 7
  • పిక్సెల్ 7 ప్రో
  • పిక్సెల్ 7a
  • పిక్సెల్ 8
  • పిక్సెల్ 8 ప్రో
  • పిక్సెల్ 8ఎ
  • పిక్సెల్ ఫోల్డ్
  • పిక్సెల్ 9
  • పిక్సెల్ 9 ప్రో
  • పిక్సెల్ 9 ప్రో XL
  • పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్
  • పిక్సెల్ 9ఎ

పిక్సెల్ లైనప్ తర్వాత శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను విడుదల చేస్తుంది. ఇందులో రాబోయే మోడళ్లతో పాటు ఇటీవల ప్రారంభించబడిన డివైజ్ లు కూడా ఉన్నాయి. 

  • Galaxy S25 సిరీస్ (S25, S25 ప్లస్, S25 అల్ట్రా మరియు S25 ఎడ్జ్)
  • గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ,జెడ్ ఫ్లిప్ 6
  • Galaxy Z Fold 7 ,Z Flip 7 (ఆండ్రాయిడ్ 16 ముందే ఇన్‌స్టాల్ చేయబడి జూలైలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు)
  • Galaxy S24 సిరీస్ అనగా గెలాక్సీ S24, గెలాక్సీ S24 Plus, గెలాక్సీ S24 Ultra లు 2025 నాలగో క్వార్టర్ నాటికి అప్డేట్ను అందుకోనుంది. 

మరోవైపు  కొత్త ఫీచర్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 16 బీటా వెర్షన్‌ను గూగుల్ విడుదల చేసింది. ఇది కొత్త ఆండ్రాయిడ్ OS తో వస్తున్న అనేక ఫీచర్లు ,అప్డేట్లను ఇప్పటికే వెల్లడించింది. 

ఆండ్రాయిడ్ 16 తో వచ్చే 10 కీలక ఫీచర్లు ,అప్డేట్లు 

  • లైవ్ యాప్ అప్‌డేట్‌లు
  • హెల్త్ కనెక్ట్ 2.0
  • ఫోటో పిక్కర్
  • కెమెరా నియంత్రణలు
  • అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
  • ఫాస్ట్ సెట్టింగ్‌లు
  • యాప్‌లు AI సాధనాలను బ్లాక్ చేయగలవు
  •  బ్లూటూత్ LE ఆడియో హియరింగ్ ఎయిడ్ ఫీచర్లు
  • ఆండ్రాయిడ్ ఫోన్లకు ఐడెంటిటీ చెక్ ఫీచర్ 
  • జెమిని AI ఇంటిగ్రేషన్లు

ఆండ్రాయిడ్ XR (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ)లో కొత్త పరిణామాలు,మెరుగైన వెబ్ సేవలు ఉండవచ్చు.