IND vs PAK: పాకిస్థాన్‌కు ఐసీసీ మరోసారి ఝలక్.. ఇండియాతో బ్లాక్ బస్టర్ పోరుకు మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

IND vs PAK: పాకిస్థాన్‌కు ఐసీసీ మరోసారి ఝలక్.. ఇండియాతో బ్లాక్ బస్టర్ పోరుకు మ్యాచ్ రిఫరీగా పైక్రాఫ్ట్

ఆసియా కప్ లో పాకిస్తాను దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాము అనుకున్నట్టు ఏదీ జరగడం లేదు. పాక్ జట్టు చేస్తోన్న ఓవర్  డిమాండ్స్ ను ఐసీసీ తిప్పికొడుతోంది. ఇండియాతో ఆదివారం (సెప్టెంబర్ 21) జరగబోయే మ్యాచ్ కు మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం తర్వాత మ్యాచ్ రిఫరీ  పైక్రాఫ్ట్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తిగా ఉంది. టీమిండియా తమకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని దీనికి కారణమైన పైక్రాఫ్ట్ ను నిషేధించాలని పాక్ బోర్డు కోరినప్పటికీ ఐసీసీ పాక్ నిర్ణయాన్ని కొట్టిపారేసింది.    

పైక్రాఫ్ట్ ను తొలగించకపోగా..ఆ తర్వాత యూఏఈతో పాకిస్థాన్ ఆడిన మ్యాచ్ కు అంపైర్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్ తర్వాత మరోసారి ఇండియాతో జరగబోయే మ్యాచ్ ను మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ను సెలక్ట్ చేయడం ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు అసలు నచ్చడం లేదు. ఇండియాతో హ్యాండ్ షేక్ వివాదం తర్వాత పాకిస్థాన్ బాగా హర్ట్ అయింది. ఆసియా కప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ట్ 17) యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించింది.  ఇందులో భాగంగానే పీసీబీ జాతీయ జట్టు సభ్యులను హోటల్‌లోనే ఉండాలని,యుఎఇతో జరిగే మ్యాచ్ కోసం వేదికకు వెళ్లొద్దని ఆదేశించింది. 

ఆటగాళ్లను వారి హోటల్ గదుల్లోనే ఉండమని చెప్పడంతో 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్ కు యూఏఈ జట్టు వచ్చినా పాకిస్థాన్ స్టేడియానికి రాలేదు. దీంతో మ్యాచ్ కు ముందు కాసేపు హై డ్రామా నడించింది. పాకిస్థాన్ అనూహ్యంగా తమ నిర్ణయాన్ని మార్చుకొని యూఏఈతో మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది. అప్పటివరకు మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్న పాకిస్థాన్ సడన్ మనసు మార్చుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవేళ పాకిస్థాన్ యూఏఈతో మ్యాచ్ ఆడకుండా టోర్నీ నుంచి వెళ్ళిపోతే ఆ జట్టు దాదాపు రూ. 140 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేది. పాకిస్థాన్ టోర్నీ నుంచి వైదొలిగితే ఐసీసీకి రూ. 140 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. 

ఏంటీ షేక్ హ్యాండ్ వివాదం:

ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌‌‌‌లో  పరిణామాలు రెండు దేశాల క్రికెట్ జట్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. టాస్ టైమ్‌‌‌‌లో ఇండియా కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్ యాదవ్, పాక్ సారథి సల్మాన్ అలీ ఆగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. విన్నింగ్‌‌‌‌ సిక్స్ కొట్టిన వెంటనే సూర్య నాన్‌‌‌‌ స్ట్రయికింగ్ ఎండ్‌‌‌‌లో ఉన్న శివం దూబేకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చి నేరుగా డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌కు వెళ్లిపోయాడు. ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇస్తారని పాక్ ఆటగాళ్లు కాసేపు గ్రౌండ్‌‌‌‌లోనే వేచి చూసి వెళ్లిపోయారు. ఇండియా ఆటగాళ్ల ప్రవర్తన, మ్యాచ్ రిఫరీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పీసీబీ ఈ వివాదంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు ఐసీసీ పాక్ ఫిర్యాదును కొట్టిపారేసింది.