అంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్ర..మంత్రి దామోదర ఇంటి ఎదుట ధర్నా

అంగన్వాడీలను నిర్వీర్యం చేసే కుట్ర..మంత్రి దామోదర ఇంటి ఎదుట ధర్నా

సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని అంగన్వాడీ ఉద్యోగులు ఆరోపించారు. సోమవారం సీఐటీయూ నాయకులతో కలిసి సంగారెడ్డిలో మంత్రి దామోదర ఇంటి ముందు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్​తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాలకు అప్పజెప్తే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26000 నిర్ణయించాలని అప్పటివరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి పీఏ హనుమాన్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యాదగిరి, శశికళ, మంగ, ఏసుమని, మంజుల,  భ్రమరాంబ, కల్పన,  జమున, గౌరమ్మ,  ఇందిరా, విజయ, అరుణ, సావిత్రి, స్వరూప, కవిత, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.