జీఓ10 రద్దు చేయండి .. అంగన్​వాడీ టీచర్స్,హెల్పర్ల నిరసన

జీఓ10 రద్దు చేయండి .. అంగన్​వాడీ టీచర్స్,హెల్పర్ల నిరసన

కొడంగల్​, వెలుగు: అంగన్​వాడీ టీచర్స్​, హెల్పర్లకు నష్టం కలిగించే జీఓ.10ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ​చేశారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శుక్రవారం కొడంగల్​ వస్తున్నారని తెలియడంతో అంగన్​వాడీలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం తెచ్చిన జీఓ.10 కింద టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50వేల రిటైర్​మెంట్ బెనిఫిట్స్​ను ప్రకటించగా.. అప్పట్లో అంగన్​వాడీలు వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టారు.

ఆ తర్వాత టీచర్లకు రూ. 2లక్షలు, హెల్పర్లకు రూ. లక్షతో పాటు వీఆర్​ఎస్​ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం పాత జీఓను అమలు చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.  ఆందోళన చేస్తున్న అంగన్​వాడీలకు నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.