అంగన్​వాడీలను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేయాలి.. సీఎంకు టీఆర్టీఎఫ్ వినతి

అంగన్​వాడీలను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేయాలి.. సీఎంకు టీఆర్టీఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ స్కూళ్లలోని 1,2,3 తరగతులను అంగన్ వాడీలకు అనుసంధానం చేయకుండా, అంగన్ వాడీలనే ప్రైమరీ స్కూళ్లలోకి మార్చి ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి అందించారు.

 ఈ సందర్భంగా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు శిక్షణ పొందిన వారు కాదని తెలిపారు. సరైన శిక్షణ పొందిన టీచర్లు మాత్రమే ప్రైమరీస్థాయి విద్యార్థులకు చదువు చెప్పగలరని చెప్పారు. ఎలాంటి శిక్షణలేని అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ వర్కర్లకు మూడో తరగతి వరకు విద్యాబోధన బాధ్యతలు అప్పగిస్తే పాఠశాల విద్యలో ఆశించిన ప్రమాణాలు దక్కవని పేర్కొన్నారు. అంగన్ వాడీల్లో క్లాసురూములు, టాయ్ లెట్లు అందుబాటులో లేవని గుర్తు చేశారు.