Timed Out: మాథ్యూస్‌కు ముందు టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైన ఆరుగురు క్రికెటర్లు వీరే

Timed Out: మాథ్యూస్‌కు ముందు టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైన ఆరుగురు క్రికెటర్లు వీరే

అరుణ్ జైట్లీ వేదికగా రెండు సెమీస్ చేరని జట్ల(శ్రీలంక, బంగ్లాదేశ్) మధ్య జరుగుతున్న పోరు అంభిమానులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ప్రారంభానికి ముందు ఇంత హైప్ లేనప్పటికీ.. టైమ్డ్ ఔట్ పద్ధతిలో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ ఔట్ కావడం మ్యాచ్‌కు ఊపుతెచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఏ ఒక్కరూ లేననప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం ఇలా ఔటైన క్రికెటర్లు ఆరుగురు ఉన్నారు. వారెవరు అన్నది ఇప్పుడు చూద్దాం..

ఆండ్రూ జోర్డాన్: టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైన మొదటి బ్యాటర్ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండ్రూ జోర్డాన్ పేరిట ఉంది. 1988లో ఈస్ట్ ప్రావిన్స్-ట్రాన్స్‌వాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ ఈ విధంగా ఔటయ్యారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. వరదల కారణంగా జోర్డాన్‌ స్టేడియానికి చేరుకోవడం లేట్‌ అయ్యిందట.

హేములాల్ యాదవ్: ఈ పద్ధతిలో ఔటైన తొలి భారత క్రికెటర్, రెండో బౌలర్ హేమలాల్ యాదవ్. 1997లో ఒడిశా- త్రిపుర మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హేమలాల్ ఈ విధంగా ఔటయ్యారు. 9వ వికెట్ కోల్పోయాక అంపైర్లు ఇరు జట్లకు డ్రింక్స్‌ విరామం ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రారంభం కాగా, అతను సమయానికి క్రీజులోకి చేరుకోలేదు. కొద్దిసేపటి అనంతరం అతను క్రీజులోకి చేరుకున్నా.. అప్పటికే అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. 

వాస్బర్ట్ డ్రేక్స్: గత ఉదాహారణలతో పోలిస్తే డ్రేక్స్ ఔటైన తీరు విచిత్రమైనది. విమానం ఆలస్యం కారణంగా ఇతను సకాలంలో స్టేడియానికి చేరుకోలేకపోయారు. ఫలితంగా అంపైర్లు అతన్ని టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔట్‌గా ప్రకటించారు. 2002-03లో సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆండ్రూ హారిస్: టైమ్ అవుట్ రూపంలో ఔటైన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్, తొలి బ్యాటర్.. ఆండ్రూ హారిస్. 2003లో నాటింగ్‌హామ్‌షైర్- డర్హామ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతను ఔటయ్యాడు. మొదట బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డ హారిస్.. వైద్యుల సలహాతో డెస్సింగ్ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. చివరకు అతనికి బ్యాటింగ్ చేయాల్సిందిగా సమాచారం వచ్చినప్పటికీ..  ప్యాడ్‌లు చేత పట్టుకుని మెట్లు దిగే సమయానికి.. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు మైదానం నుండి బయటికి వచ్చేశారట.

ర్యాన్ ఆస్టిన్: ఈ విధంగా ఔటైన మరో క్రికెటర్ ర్యాన్ ఆస్టిన్ (వెస్టిండీస్‌). 4 డే మ్యాచ్ లో ఆస్టిన్ ఔటైనట్లు సమాచారం ఉంది.

చార్లెస్ కుంజే: జింబాబ్వే క్రికెటర్ చార్లెస్ కుంజే కూడా  టైమ్డ్ ఔట్ పద్ధతిలో ఔటైనప్పటికీ.. ఎలా జరిగిందనేది అస్పష్టంగా ఉంది. 2017-18లో లోగాన్ కప్‌లో భాగంగా బులవాయో మౌంటెనీర్స్‌- మతాబెలెలాండ్ టస్కర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.