యానిమేషన్ అవకాశాలు పెరుగుతున్నయ్ .. మహా అవతార్ నరసింహ దర్శకుడు అశ్విన్ కుమార్

యానిమేషన్ అవకాశాలు పెరుగుతున్నయ్ .. మహా అవతార్ నరసింహ దర్శకుడు అశ్విన్ కుమార్

బషీర్​బాగ్, వెలుగు: యానిమేషన్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని మహా అవతార్ నరసింహ చిత్ర దర్శకుడు అశ్విన్ కుమార్ తెలిపారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానంతో రాణించాలని సూచించారు.

రవీంద్ర భారతి కళావేదికపై ఆసిఫా ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. సుమారు 1100 మంది విద్యార్థులు, కళాకారులు, విద్యావేత్తలు, సినీ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో యానిమేషన్ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు అధికంగా  వస్తాయన్నారు.