అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ.. తన తదుపరి చిత్రం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించబోతు న్నాడు. తన కెరీర్‌లో ఇది 23వ చిత్రం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై వైరల్ అయింది. ముఖ్యంగా అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యూత్‌కు విపరీతంగా నచ్చింది.
దీంతో ఈ థీమ్ మ్యూజిక్‌తో ఇప్పటివరకూ ఏకంగా వన్ మిలియన్‌కు పైగా రీల్స్ వచ్చాయి. షూటింగ్ కూడా స్టార్ట్ అవకముందే ఇలా మ్యూజిక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీన్ని సెలబ్రేట్ చేస్తూ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కలిసి దిగిన ఓ సెల్ఫీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ షేర్ చేసింది. థీమ్ మ్యూజిక్‌కు ఈ స్థాయిలో హైప్ రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెకెండాఫ్‌లో సినిమా సెట్స్‌కు వెళ్లబోతోంది.
