
విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య(Krishna Chaitanya) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో అంజలి(Anjali) రత్నమాల గా నటిస్తున్నట్లు తన పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజు చేసింది.
ఇక..అంజలి తన ఇంటెన్స్ లుక్ తో ఒక్కసారిగా సినిమా పై క్యూరియాసిటీ పెంచేసింది.
ఒక్క సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లోనూ ఇటీవల అదరగొడుతుంది అంజలి.మొన్నటికి మొన్న ఝాన్సీలో కీ రోల్ పోషించింది. ఇటీవల ఫాల్ లాక్స్ అనే మరో వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఓ వైపు సినిమాలు.. మరో వైపు వెబ్ సిరీస్ లతో రెండు పడవలపై సమర్థవంతంగా దూసుకెళుతుంది అంజలి. ట్రెండ్ కు తగ్గట్టు కెరీర్ ను బిల్డప్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది అంజలి.
అంజలి తెలుగు హీరోయిన్ అయినా తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది.
అలాగే అంజలి తమిళ్ డైరెక్టర్ శంకర్(Shankar)-రామ్ చరణ్(Ram Charan)కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్' మూవీలోనూ కీ రోల్ లో నటిస్తుంది.