
నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో కృతి శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లుగా అలరించనున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుదాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ సాంగ్ ను వదిలారు మేకర్స్. ‘రా రా రెడ్డి’ అనే ఈ మాస్ బీట్లో హీరోయిన్ అంజలి తన అందాలతో ఆకట్టుకుంది.. ఇందులో నితిన్, అంజలి మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.
ఈ పాటను లిప్సిక పాడగా.. మహతి స్వర సాగర్ అందించాడు. జానీ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫి చేశారు. ఇక భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చెక్, రంగ్ దే, మాస్ట్రో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సారి ఎలాగైనా మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. మరి నితిన్ “మాచర్ల నియోజకవర్గం”తో హిట్ అందుకుంటాడో.. లేదో చూడాలి.