ముషీరాబాద్ లో గెలిచేది కాంగ్రెస్సే : అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్ లో గెలిచేది కాంగ్రెస్సే : అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, వెలుగు:  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.  ముషీరాబాద్  నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విసుగు చెంది మార్పు కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు.  సోమవారం నియోజకవర్గంలోని కవాడిగూడ లోని వివిధ ప్రాంతాలు బస్తీల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

బస్తీల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని, లో ఫ్రెషర్ తో మంచినీళ్లు వస్తున్నాయని, డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేదని వీటి మధ్య ఎట్లా నడిచేది అంటూ అంజన్ కుమార్ యాదవ్ ముందు స్థానిక ప్రజలు ఏకరువు పెట్టారు.  అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..  కాంగ్రెస్‌‌కు పట్టం కట్టండి సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి పాల్గొన్నారు.